పూజా హెగ్డే అందుకే దూరం

74
- Advertisement -

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ మధ్య తెలుగు మీడియాకి దూరంగా ఉంటుందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలాగే తెలుగు సినిమాలు కూడా ఎక్కువ ఒప్పుకోవడం లేదు. మహేష్ సినిమా ఒప్పుకుంది అంతే. పూజా హెగ్డే ఇటు తమిళ్ మరియు అటు హిందీ సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. సల్మాన్ ఖాన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఇంకా పెరగనుంది.

రీసెంట్ గా పూజా హెగ్డే హిందీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ గురించి, హిందీ సినీ పరిశ్రమ గొప్పతనం గురించి బోలెడు విషయాలు కూడా చెప్పుకొచ్చింది పూజా. కానీ, టాలీవుడ్ పై మాత్రం నో కామెంట్స్ అంటుంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఈ మధ్య తెలుగు మీడియాకి చిక్కటం లేదు అంటున్నారు. మరోవైపు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉందని గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ వార్తను సల్మాన్ టీమ్ కొట్టిపారేసింది అనుకోండి.

కానీ, పూజా హెగ్డే మాత్రం స్పందించలేదు. పైగా టాలీవుడ్ ఎక్కడ దీని గురించి ప్రశ్నలు అడుగుతుందో అన్న భయంతోనే పూజా హెగ్డే కావాలని తెలుగు మీడియాకి దూరంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. తన ప్రేమ విషయమై పూజా హెగ్డే ఎలాంటి పుకార్లకు రియాక్ట్ అవ్వాలని అనుకోవడం లేదని, అందుకే కావాలని ఆమె తెలుగు రాష్ట్రాల మీడియాకి దూరంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో పూజా హెగ్డేనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి…

పఠాన్‌…కంబ్యాక్‌ బాలీవుడ్‌

ట్రోల్స్ పై బాలయ్య స్పందన

బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై…శర్వానంద్‌

- Advertisement -