పఠాన్‌…కంబ్యాక్‌ బాలీవుడ్‌

32
- Advertisement -

చాలా కాలంగా బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించిన సినిమా పఠాన్. బాద్‌షా షారుక్‌ఖాన్ నటించిన పఠాన్ సినిమా తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్ల కలెక్ట్‌ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన స్పై అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన…సినిమాతో షారుఖ్ ఖాన్ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపుగా 4యేళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు షారుఖ్.

జనవరి 25న విడుదలైన పఠాన్…ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.100కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ప్రముఖ హిందీ క్రిటిక్స్ తరుణ్ ఆదర్శ్ ప్రకారం వరల్డ్‌ వైడ్‌గా ఓవర్సీస్ మార్కెట్‌లో షారుఖ్‌ మేనియాను పఠాన్ వసూళ్లతో నిరూపించింది. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాన్‌ ప్రతినాయకుని పాత్రలో నటించి మెప్పించారు. ఆది నుంచే పఠాన్ సినిమాను బాయ్‌కట్‌ ట్రెండ్ నడిపించిన…బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్‌ చేసింది. అన్నట్టు కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో నటించారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పఠాన్ సినిమాను తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి…

ట్రోల్స్ పై బాలయ్య స్పందన

బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై…శర్వానంద్‌

బాలయ్య భామకు భారీ ఆఫర్స్!

- Advertisement -