బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై…శర్వానంద్‌

20
- Advertisement -

టాలెంటెడ్ యంగ్‌ హీరో శర్వానంద్ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చేప్పేశారు. రక్షితారెడ్డితో హీరో శర్వానంద నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాణ మిత్రుడు, నటుడు రాంచరణ్-ఉపాసన హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.

చరణ్‌ ఉపాసన శర్వానంద్‌ రక్షితారెడ్డితో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది. కాగా త్వరలో వెడ్డింగ్ డేట్‌ ఇతర వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారు శర్వానంద్‌. గతంలో బాలయ్యతో ఆన్‌స్టాపబుల్‌ సీజన్‌2లో సందడి చేసినప్పుడు ప్రభాస్‌ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శర్వానంద్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో రాశీకన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి…

బాలయ్య భామకు భారీ ఆఫర్స్!

అక్కినేని ఫ్యాన్స్ ధర్నా

జనవరి 30…దసరా టీజర్‌

- Advertisement -