కూలి కోసం చీరలమ్మిన కవితక్క..

201
Nizamabad MP Kavitha sold sarees as part of goolabi coolie days..
Nizamabad MP Kavitha sold sarees as part of goolabi coolie days..
- Advertisement -

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు నిధులు సేకరించేందుకు మంత్రి కేటీఆర్ గులాబీ కూలీగా మారి ఐస్‌ క్రీం అమ్మిన సంగతి తెలిసిందే. తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత చీరలమ్మారు. టీఆర్‌ఎస్ కూలి పనుల్లో భాగంగా నిజామాబాద్ ఎల్వీఆర్ షాపింగ్ మాల్‌లో ఎంపీ కవిత వినియోగదారులకు చీరలు అమ్మారు. శ్రమదానానికి ఫలితంగా ఎంపీ సుమారు ఏడు లక్షల రూపాయలను ఆర్జించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీఆర్ఎస్ పార్టీ గులాబీ కూలీ దినాలుగా పాటిస్తుంది. గులాబీ కూలీ దినాల్లో కార్యకర్తలు, పార్టీ నేతలు శ్రమదానం చేసి ప్లీనరీ, బహిరంగ సభకు విచ్చేసే నిమిత్తం ఎవరి సొంత ఖర్చులకు వారే సంపాదించుకోవాలని సీఎం సూచించిన విషయం తెలిసిందే.

kavitha kavitha-saaries

- Advertisement -