హైదరాబాద్ ప్రజలకు భారతవాతావరణ శాఖ ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఖైరాతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ వంటి ఐదు జోన్లలో ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చిరించింది. జనవరి 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈమేరకు ఉష్ణోగ్రత 11డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్లో ఆలర్ట్‌ను జారీ చేసింది.
హైదరాబాద్‌తో పాటుగా ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో చలిగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే నిన్న కేరళలలోని కొట్టాయం జిల్లాలో విపరీతమైన ఎండగాలులు ఉన్నాయని భారతవాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి…