ఉసేన్‌ బోల్ట్‌కు రూ. 100 కోట్ల టోకరా!

45
- Advertisement -

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కు టోకరా పడింది. పరుగుల వీరుడి ఖాతాలోని రూ.103 కోట్లు మాయం అయ్యాయి. ఆర్థిక మోసానికి గురై భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఆయన కోల్పోయిన మొత్తం 1.2 కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.103 కోట్లు).

పదవీవిరమణ-జీవితకాల సేవింగ్స్‌ కింద జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లోని స్టాక్స్‌ అండ్‌ సెక్యురిటీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎ్‌సఎల్‌) అనే పెట్టుబడుల సంస్థలో బోల్ట్‌ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఖాతాలో 12 వేల డాలర్లు (రూ.9.76 లక్షలు) మాత్రమే ఉన్నాయి.

ఈ సొమ్మును కంపెనీ తిరిగి జమ చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని బోల్ట్‌ తరఫు న్యాయవాది లింటన్‌.పి. గోర్డ్డాన్‌ హెచ్చరించారు. కంపెనీలో జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించిన విషయాలను ఆయ న ఫార్చూన్‌ మేగజైన్‌ అనే పత్రికతో ఫోన్‌లో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -