యాక్షన్ వద్దు, కామెడీ ముద్దు

76
- Advertisement -

నిజానికి విజయ్ దేవరకొండకి స్టార్ డమ్ ను తెచ్చి పెట్టింది గీతాగోవిందం లాంటి పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్సే. అయితే, స్టార్ అయ్యాం కాబట్టి.. అర్జెంట్ గా ఫైట్లు గట్రా చెయ్యాల్సిన అవసరం వచ్చేసింది అంటూ విజయ్ దేవరకొండ లైగర్ లాంటి యాక్షన్ ఫిల్మ్స్ చేసి పెద్ద తప్పు చేశాడు. మన సక్సెస్ కు ఏది ప్లస్ అయిందో.. అదే వదిలి పెట్టడం మంచిది కాదు అని చివరకు విజయ్ అర్థం చేసుకున్నాడు. పైగా లైగర్ రూపంలో పెద్ద షాక్ కొట్టించుకున్నాడుగా.

మొత్తానికి జనాలకు ఫన్ అందిస్తే మినిమమ్ గ్యారంటీ వుంటుందని విజయ్ దేవరకొండకు తత్వం బోధ పడింది. మెగాస్టార్ చిరంజీవి లాంటోడే వాల్తేరు వీరయ్యతో కామెడీ చేయాల్సి వచ్చింది. కామెడీకి ఉన్న గిరాకీ అది. అందుకే.. ఇప్పుడు విజయ్ దేవరకొండ చూపు కామెడీ మీద పడింది. అందుకే ఇప్పుడు విజయ్ దేవరకొండ కామెడీ కథల కోసం చూస్తున్నాడట. ఎవరైనా కథలు చెప్పడానికి వస్తే ఫన్ స్టోరీస్ ప్లీజ్ అంటున్నాడట. సీరియస్ కథ ఇప్పట్లో వద్దు. కామెడీయే ముద్దు అంటున్నాడట.

విజయ్ దేవరకొండ ఐడియా బాగానే వుంది. కానీ కేవలం విజయ్ దేవరకొండ మీద కామెడీ అంటే పండాలి కదా?. కామెడీకి చాలా వేరియేషన్స్ చూపించాలి. విజయ్ దేవరకొండ కచ్చితంగా మంచి నటుడే. కానీ కామెడీ పడించే అంత గొప్ప టాలెంట్ ఉందా ?, ఓ లెవెల్ లో కామెడీ చేస్తేనే వ్యవహారం సక్సెస్ అవుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద కేవలం కామెడీ మాత్రం పండించాలంటే డైరక్టర్ కు చాలా టాలెంట్ వుండాలి. అలాంటి డైరక్టర్..అలాంటి కథ దొరకాలన్నమాట విజయ్ దేవరకొండకు.

ఇవి కూడా చదవండి…

పవన్ సినిమాలో లైగర్ బ్యూటీ

‘పఠాన్’ పై భారీ అంచనాలు

‘హంట్’ ట్రైలర్ టాక్

- Advertisement -