మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబో మూవీ SSMB28 రేపటి నుండి షూటింగ్ మొదలు కానుంది. సినిమా ఎనౌన్స్ అయినప్పటి నుండి ఏదో ఒక ఆటంకంతో షూటింగ్ పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రేపటి నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ ఘాట్ జరుపుకోనుంది. ఆ మధ్య కొన్ని రోజుల పాటు యాక్షన్ సీన్స్ షూట్ చేసిన త్రివిక్రమ్ ఆ సీన్స్ ను సినిమాలో వాడటం లేదని తెలుస్తుంది.
సొ రేపటి నుండి జరిగే షూట్ తోనే సినిమా మొదలు కానుంది. ముందుగా యాక్షన్ ఎపిసోడ్ తోనే షూట్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అరవై రోజుల పాటు జరగనున్న ఈ షూట్ లో మహేష్ , పూజ హెగ్డే , శ్రీ లీల మిగతా ఆర్టిస్టులు పాల్గొంటారు. అన్బురివు యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేయనున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నారు.
హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 11 న థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అదే డేట్ ఫిక్స్ అయి వర్క్ చేయబోతున్నారు. మరి త్రివిక్రమ్ అండ్ టీం ఈ టార్గెట్ రీచ్ అవుతారా ?
ఇవి కూడా చదవండి…