మోదీపై ప్రశంసల జల్లు..ఎక్కడంటే?

42
- Advertisement -

భారత్‌ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి 75యేళ్లు పూర్తైంది. కానీ భారతదేశంపై కొన్ని దేశాలు విషప్రచారం చేస్తూ…పబ్బం గడుపుకుంటున్నాయి. 2014 తర్వాత నుంచి భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోయయాని ప్రపంచదేశాల ప్రజలు గుర్తిస్తున్నారు. విషప్రచారం చేసే దేశాలు ఇప్పటికి అది గుర్తించకపోతుంది. అయితే తాజాగా ఆదేశాన్నికి చెందిన ఓ ప్రముఖ మీడియా మాత్రం ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నాయి. గత కొంతకాలంగా భారత్ అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుతున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని ది ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ పత్రికకు పాకిస్థాన్ రాజకీయ భద్రతా రక్షణ అంశాల విశ్లేషకుడు షెహ్‌జాద్ ఛౌద్రీ రాసిన వ్యాసంలో పలు ఆంశాలు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌ అంతర్జాతీయంగా తన పలుకుబడిని పెంచుకోవడంతో పాటు ఎన్నో అంశాల్లో ప్రభావం కూడా చూపుతోందని ప్రశంసించింది. ముఖ్యంగా ఎంతో నైపుణ్యంతో విదేశీ విధానాన్ని కొనసాగిస్తున్నారని తద్వారా దేశ జీడీపీని 3ట్రిలియన్‌ డాలర్లకు పెరిగిందని చెప్పారు. విదేశీ విధానంలో భారత్‌ తనకంటూ ప్రత్యేక పరిధిని ఏర్పరచుకుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ఐటీ రంగంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని గుర్తుచేశారు.

భారత్‌లో ప్రతి ఎకరాకు వచ్చే దిగుబడి కూడా ప్రపంచంలోనే ఉత్తమమైందన్నారు. కొన్ని ప్రతికూల సమయాల్లోనూ భారత్ పాలనా వ్యవస్థ తట్టుకొని నిలిచిందని అన్నారు. భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తేవడంలో గతంలో ఎవ్వరూ చేయని పనిని మోదీ చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత విదేశాంగ విధానంపై పొగడ్తలు కురిపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

సంక్రాంతి కానుకగా వందే భారత్‌…

తెలంగాణ అభివృద్ధికి కలిసిరండి..

నేటి బంగారం, వెండి ధరలివే

- Advertisement -