ఆయన రాజమౌళి కొడుకు కాదట..!

223
- Advertisement -

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఆయన మాత్రమే కాకుండా ఆయన కుటుంబం మొత్తం దాదాపు ఐదేళ్లపాటు ‘బాహుబలి’కి అంకితమైపోయింది. ‘బాహుబలి’కే కాకుండా అంతకు ముందు సినిమాలకు కూడా రాజమౌళి కుటుంబం పనిచేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రమా రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వృత్తిలోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా రమా రాజమౌళి .. జక్కన్నకు  ఎంతో అండగా ఉంటారని రాజమౌళి చాలా సార్లు ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇప్పుడు కొడుకు “కార్తికేయ” ను కూడా సినిమా రంగంలో దింపేశాడు “రాజమౌళి”. రాజమౌళి – కీరవాణి అన్నదమ్ములు అని మనలో చాలా మందికి తెలుసు. కానీ “రమా రాజమౌళి” మరియు కీరవాణి గారి సతీమణి “శ్రీవల్లి”  సొంత అక్కచెల్లెలు అని చాలా తక్కువమందికి తెలుసు. ఇప్పుడు అసలు మేటర్ ఏంటంటే..ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో “రమా రాజమౌళి”  కార్తీకేయ గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించింది.

Rajamouli Opens About Personal Life

తనకు 2001 లో రాజమౌళితో పెళ్ళి అయ్యే సమయానికి తాను ఒక కొడుకున్న డైవర్సీ అన్న విషయాన్ని స్వయంగా లీక్ చేసింది రమా రాజమౌళి. ఇదే విషయాన్ని రాజమౌళి సైతం 2012లో వెల్లడించారు. రమాతో నాకు చిన్నప్పటి నుండే పరిచయం ఉంది. కానీ చాలా సంవత్సరాల తరవాత ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకునేటప్పటికి తనకి ఒక అబ్బాయి ఉన్నాడు. డివోర్స్ అయిన తరవాత నేను పెళ్లి చేసుకున్న అని చెప్పాడు.

ఇదే సందర్భంలో రమా రాజమౌళి తమ జీవితాలకు సంబంధించి చాలామందికి తెలియని విషయాలను ఈ ఇంటర్వ్యూలో తెలియచేసింది. రాజమౌళి వర్క్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో ఫ్యామిలీ అన్నా అంతే ఇష్టం అన్న విషయాన్ని చెపుతూ తామిద్దరం సినిమాల నుంచి రిటైర్ అయిపోయాక ఏ ఊర్లు, ఏ దేశాలు తిరగాలి అన్న విషయాలు ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తూ ఉంటాము అన్న విషయాన్ని రమ తెలియచేసింది.

ఇక వర్క్ లో పడిపోయిన తరువాత ఆ టెన్షన్ కు రాజమౌళి విచిత్రంగా మారిపోతాడు అని చెపుతూ ఒకొక్కసారి ఈసినిమాల టెన్షన్ లు వల్ల ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తన సెల్ అక్కడ మర్చిపోయి తన సెల్ ఫోన్ అనుకుని వాళ్ళ టివి రిమోట్ ను జేబులో పెట్టుకుని వచ్చేసాడని చెప్పింది రమారాజమౌళి. అదేవిధంగా కొన్ని సార్లు వేరే వ్యక్తుల కారు కీస్ తన కారు కీస్ అనుకుని జేబులో పెట్టుకుని వచ్చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి అంటూ జోక్ చేసింది రమ.

ఇక ఆదివారం వస్తే చాలు రాజమౌళి చుట్టూ ఆయన చుట్టాల పిల్లలు అందరు చేరి రాజమౌళి సినిమాల పై పిల్లలు చేసే ఘాటైన విమర్శలకు రాజమౌళి తెగ ఎంజాయ్ చేస్తాడు అని చెపుతూ అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ భోజనం చేయడం రాజమౌళికి చాల ఇష్టం అన్న విషయాన్ని బయట పెట్టింది.

- Advertisement -