‘వీరయ్య’ ఓటీటీ, శాటిలైట్ పై క్లారిటీ

84
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మాస్ అండ్ పక్కా కామెడీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్మించారు. కాగా ఇవాళ ఈ మూవీ రిలీజ్ అయిన నేపథ్యంలో శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. వాల్తేరు వీరయ్య శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకోగా.. ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

మరోపక్క ‘వాల్తేరు వీరయ్య’ పై ఫ్యాన్స్ తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అదే ఉత్సాహంతో ట్విట్టర్ లో సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ‘ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అయితే అదుర్స్‌ అంటున్నారు. సెకండాఫ్‌ యావరేజ్‌ అని, రవితేజ, చిరు మధ్య సీన్స్‌ అయితే చాలా బాగున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

ఇక అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కూడా చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘వాల్తేరు వీరయ్య.. నూతన సంవత్సరాన సరికొత్త శుభారంభం.. ముందే మొదలైన సంక్రాంతి సంబరం.. వెండితెరపై వీరయ్యగా మెగా విశ్వరూపం.. తెలుగు చిత్రసీమలో చిరంజీవి ఓ శిఖరం.. జై వీరయ్య.. జయహో వాల్తేరు వీరయ్య !’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని మెగాస్టార్ అభిమానులు వేచిచూస్తున్న వాల్తేరు వీరయ్య మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1200కు పైగా థియేటర్లలో విడుదలైంది.

ఇవి కూడా చదవండి…

వీరసింహారెడ్డి .. ఆల్ టైం రికార్డ్

అహింస..థియేట్రికల్ ట్రైలర్‌

వారిసు బ్లాక్ బస్టర్..

- Advertisement -