మలయాళీ భామ ఐశ్వర్య లక్ష్మి తమిళ నటుడు అర్జున్ దాస్ తో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ.. అర్జున్ దాస్ తో నేను ప్రేమలో లేను. అర్జున్ దాస్ తో నేను డేటింగ్ చేయడం లేదు. కేవలం తనతో ఒక క్లోజప్ పిక్ తీసుకున్నాను. అది కూడా స్నేహపూర్వకంగా మాత్రమే తీసుకున్నాను అని తెలుపుతూ తనపై వచ్చిన రూమర్స్ కు ఐశ్వర్య లక్ష్మి చెక్ పెట్టింది..
ఐశ్వర్య లక్ష్మికి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఆమె సినిమాలు అంటే కుర్రాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ తో డేటింగ్ చేస్తుంది అనగానే ఈ వార్త వైరల్ అయింది. దీనికితోడు ఐశ్వర్య లక్ష్మి చాలా బోల్డ్ గా ఉంటుంది. ఆ మధ్య ఓ నిర్మాతతో కూడా ఆమె చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది. మొత్తమ్మీద అర్జున్ దాస్ తో తనకి ఆ బంధం లేదని ఐశ్వర్య లక్ష్మి ఓపెన్ గా చెప్పేసింది.
ఒక హీరో సిద్దార్థ్ మల్హోత్రా కూడా కియారా అద్వానీతో ప్రేమ, పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెగ వినిపించాయి. ఐతే తాజాగా దీనిపై సిద్దార్థ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూ లో తను మాట్లాడుతూ.. మరీ నన్ను ఎవరు నా పెళ్లికి పిలవలేదు ఏమిటి ?, గతంలో కూడా రెండుసార్లు తన పెళ్లి వార్తలపై ప్రచారం జరిగినట్లు తెలిపాడు. ప్రస్తుతం తాను సినిమాలపై శ్రద్ధ పెడుతున్నట్లు.. జీవితంపై ఇమేజినేషన్ లను పట్టించుకోనంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కియారతో తనకు ఇప్పట్లో పెళ్లి లేదని సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి..