ఈ-రేస్‌..తెలంగాణకు గర్వకారణం

82
- Advertisement -

హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలిసారి జరగనున్న ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా ముంబైలో ఈ రేస్ కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..భారత్‌లో తొలిసారిగా ఫార్ములా- ఈ రేస్‌ ప్రపంచ పోటీలు నిర్వహించే అవకాశం.. తెలంగాణకు రావడం గర్వకారణమని అన్నారు.ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా భవిష్యత్‌ తరాలకు మెరుగైన జీవనాన్ని అందించగల్గుతాం. అంతర్జాతీయ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరుగడం మరిచిపోలేని అనుభూతి. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ వాసులందరినీ సాదరంగా తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం అన్నారు.

వాతావరణ కాలుష్యానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పూర్తిగా ఎలక్ట్రిక్‌ బ్యాటరీలతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన కార్లు హైదరాబాద్‌ రోడ్లపై రయ్య్‌మ్రంటూ పరుగులు తీయనున్నాయి. తొమ్మిదో సీజన్‌లో భాగంగా నాలుగో రేసుకు హైదరాబాద్‌ వేదిక కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -