కళ్యాణ్ రామ్‌…అమిగోస్‌ అద్భుతం

147
- Advertisement -

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌ నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార హిట్‌తో జోష్ మీదున్న కళ్యాణ్ రామ్ తాజాగా అమిగోస్‌ అంటూ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఫిబ్రవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

కళ్యాణ్‌రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

రక్త సంబంధం లేకుండా ఒకే రకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుసుకోవడం..అందులో ఒకరు ఇన్నోసెంట్‌గా, మరొకరు స్టైలిష్‌గా, ఇంకొకరు నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న వ్యక్తిగా టీజర్‌లో కనిపించారు. మనం కలవడం ఓ అద్భుతం.. విడిపోవడం అవసరం అంటూ కళ్యాణ్‌ రామ్‌ డైలాగ్స్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -