వచ్చే మార్చ్ కి ఆర్ఆర్ఆర్ విడుదలై ఏడాది కాబోతుంది. ఆస్కార్ గెలిచే దాకా ఈ సినిమా పరుగు ఆపేలా లేదు. తాజాగా రాజమౌళి న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ నుండి ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కాస్ట్యూమ్ డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ కు థాంక్స్ స్పీచ్ మొదలు పెట్టి రాజమౌళి మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా RRR గురించి మరో సంతోషకరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది కిక్ ఇచ్చే న్యూస్.
యుఎస్ లో మోస్ట్ పాపులర్ అయిన మీడియా హౌస్ లో ఒకటైన వెరైటీ సంస్థ ముందస్తుగా రిలీజ్ చేసే లిస్ట్ ఇప్పుడు బయటికొచ్చింది. ఈ సంస్థ నుండి వచ్చే లిస్ట్ దాదాపు కన్ఫర్మ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా బెస్ట్ యాక్టర్ గా టాప్ 10 లిస్టుని వెరైటీ సంస్థ రిలీజ్ చేసింది. అందులో జూనియర్ ఎన్టీయార్ పేరు ఉంది. RRR లో తారక నటన ఆధారంగా తయారు చేసే పేర్లు కాబట్టి ఆ రకంగా చూసుకున్నా ఇది గొప్ప గుర్తింపు కిందే లెక్క.
ఎన్టీఆర్ కి ఆస్కార్ దక్కినా దక్కకపోయినా, ఒక ఇండియన్ మూవీ ఇంత దూరం వెళ్లడం మాత్రం ఇదే మొదటిసారి. గతంలో కమల్ హాసన్, అమీర్ ఖాన్ లాంటి ఎందరో లెజెండ్స్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ ఇలా టాప్ టెన్ ప్రిడిక్షన్స్ లో చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో వెరైటీ సంస్థ ప్రిడిక్షన్ లిస్ట్ లో తారక పేరు ఉండటం నిజంగా గర్వకరణమే.

