- Advertisement -
ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 18 వేల మందిపై వేటు వేయనుంది. ఈ విషయాన్ని అమెజాన్ సీఈవో జస్సీ వెల్లడించారు.
ఈ ఉద్యోగుల తొలగింపుల వల్ల ఉద్యోగులకు కష్టమని తెలిసినా నిర్ణయం తీసుకోక తప్పడం లేదని సీఈఓ చెప్పారు. ఉద్యోగుల తొలగింపు యూరప్ దేశాల్లో ఉంటుందని జనవరి 18వతేదీ నుంచి తొలగించే ఉద్యోగులకు సమాచారం అందిస్తామని జస్సీ తెలిపారు. మా సంస్థలో ఓ సహచరుడు లే ఆఫ్ సమాచారాన్ని లీక్ చేయడంతో తాము ఈ ప్రకటన చేస్తున్నామని జస్సీ పేర్కొన్నారు.
అమెజాన్ గత ఏడాది నవంబర్ నెలలో 10వేలమంది ఉద్యోగులను తొలగించింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -