కామెడీలో వీరయ్య వీరత్వం

14
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – రవితేజ.. అసలు ఈ కాంబినేషన్ చాలు.. థియేటర్స్ హౌస్ ఫుల్ కావడానికి. పైగా సంక్రాంతి టార్గెట్. ఇక బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లాభాలు తేస్తాడా ? అని మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ మధ్యకాలంలో వాల్తేరు వీరయ్య సినిమా రేంజ్ లో ఏ సినిమాకు ప్రచారం జరగడం లేదు. రిలీజ్ కి ఇంకా సమయం వుండగానే.. నెల ముందు నుంచే వరుస ఇంటర్వ్యూలు, భారీ ప్రెస్ మీట్ ల హడావుడి.. ఇలా అంతా వాల్తేరు వీరయ్య గురించే. అటు మెగాస్టార్ చిరంజీవి ఇటు రవితేజ, ఈ ఇద్దరితో సమానంగా దర్శకుడు, నిర్మాతలు ఇలా అందరూ కలిసి వాల్తేరు వీరయ్య సినిమా ప్రచారాన్ని భుజాన మోసేసారు.

వాల్తేరు వీరయ్య టీమ్ కనిపించని యూట్యూబ్ ఛానెల్ లేదు. ట్రెండ్ అవ్వని వాల్తేరు వీరయ్య టీమ్ ఇంటర్వూ లేదు.. వాల్తేరు వీరయ్య గురించి చెప్పని గొప్ప మాటలు లేవు. ఆ రేంజ్ ప్రచారం అందుకుంది వాల్తేరు వీరయ్య. మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?, కామెడీ టైమింగ్ కి ఇటు మెగాస్టార్, అటు రవితేజ పెట్టింది పేరు. అందుకే, సినిమాలో కామెడీ కేక అంట. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమాలో కామెడీ జంధ్యాల, ఈవీవీ సినిమాలా మాదిరిగా వుంది. ఈ వాల్తేరు వీరయ్యలో లాజిక్ లు చూడకుండా కామెడీ ఎంజాయ్ చేయడమేనట. అయిదారు కామెడీ బ్లాక్ లు అయితే అద్భుతంగా పండాయని బోగట్టా.

సినిమా తొలిసగం మొత్తం మెగాస్టార్ – రవితేజ కామెడీని ఎంజాయ్ చేస్తూనే వుంటారట ప్రేక్షకులు. చిరంజీవి.. రవితేజ ల నడుమ జరిగే ఎపిసోడ్ సెకండాఫ్ కు హైలైట్ అని తెలుస్తోంది. సినిమా మొత్తం కామెడీ సీన్లు చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే. దర్శకుడు బాబీ కథ థ్రెడ్, లాజిక్ లు వెదుకుతూ వుండడం వుండదు. చూస్తుంటే బాబీ ఈ సారీ మొత్తంగా పక్కాగా ఓన్లీ కామెడీనే నమ్ముకున్నట్టు ఉన్నాడు. మరీ ఓన్లీ కామెడీనే హైలైట్ గా ఉంటే.. ఈ వీరయ్యను మెగా ఫ్యాన్స్ తమ భుజాన విజయవంతంగా మోస్తారా?!.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన సముద్రఖని

చైతు దర్శకుడితో విజయ్ ?

బాలయ్య అన్‌స్టాపబుల్‌కు కేటీఆర్‌, రాంచరణ్‌?

- Advertisement -