కిస్‌మిస్‌ పండ్లతో ఆరోగ్యం..

142
- Advertisement -

ద్రాక్ష పండ్లను ఎండబెట్టి త‌యారు చేసే ఎండు ద్రాక్ష‌ను కొన్ని ర‌కాల తీపి వంట‌కాల్లో మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. దీన్నే కిస్మిస్ అని కూడా అంటారు. కొంద‌రైతే వీటిని అలాగే డైరెక్ట్‌గా ఎంతో ఇష్ట‌ప‌డి తింటారు. అయితే చ‌క్క‌ని రుచిని అందించే ఆహారంగానే కాక కిస్మిస్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటితో ప‌లు అనారోగ్యాల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తిన‌డం వ‌ల్ల మూత్రాశ‌యంలో అమ్మోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కిస్‌మిస్ పండ్లను తర‌చుగా తినడం వల్ల‌ శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

పది కిస్‌మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా ఉడకబెట్టి గుజ్జుగా చేసి ఆ ద్ర‌వాన్ని తాగితే రక్తం శుభ్ర‌ప‌డుతుంది. న‌రాల‌కు బ‌లం చేకూరుతుంది.

పిల్లలు రాత్రి పూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతిరోజూ రాత్రి పూట రెండు ఎండు ద్రాక్ష ప‌లుకులను ఇవ్వండి. దాంతోపాటు వారికి ఆ వారం పాటు చలవ చేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీని వల్ల‌ పక్క తడిపే అలవాటును వారు మానుకుంటారు.

గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది.

మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.

- Advertisement -