లక్ష కిలో మీటర్లు నడవాలన్న ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం కోసం బీఆర్‌ఎస్ పార్టీ పెట్టాము అని అన్నారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే.. సాధించలేనిదంటూ ఏమీ ఉండదన్నారు. బీఆర్ఎస్ అంటే తమషా కోసమో, చెక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమే కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని అన్నారు.
ఒకప్పుడు స్వాతంత్య్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం. జీవితాలను ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో, అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యకాలపాలు మొదలుపెట్టామని అన్నారు. చక్కటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
గత 50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాకు అవగాహన కలిగినటువంటి భారతదేశం ఏ దశకు చేరుకోవాల్నో చేరుకోలేదు. ప్రజల కోరికలు, స్వాతంత్ర్య ఫలాలు సిద్ధించలేదు. మన కంటే అమెరికా, చైనా ముందున్నవి. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే వ్యవసాయ భూములు ఉన్నాయి. 16 శాతం మాత్రమే సాగు యోగ్యమైన భూమి చైనాలో ఉంది. కానీ మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో సూమారుగా 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ తెలిపారు.
ప్రతి సంవత్సరం దేశంలో లక్ష 40వేల టీఎంసీల వర్షం పడుతుందన్నారు. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా పెద్దగా నిర్మించలేకపోతున్నామని అన్నారు. జింబాబ్వే అమెరికాలో అనేక పెద్ద డ్యామ్‌లు నిర్మించారని…కానీ మనకు ఎందుకు సాధ్యము కావడం లేదన్నారు.
మన దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 4 లక్షల మెగావాట్లు ఉత్పత్తి అవుతుందన్నారు. కానీ ఎందుకు ఉచితంగా కరెంటు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు. ఏ గొప్ప పని ప్రారంభించిన మొదట్లో ఆవహేళన చేస్తారని అన్నారు. దేశంలో ప్రభల మార్పులు తేవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అచ్చం రాజకీయాలు రావాలని కోరుకుంటున్న అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలని చూస్తున్నారు. మీరు అమ్మండి మేం మళ్లీ కోంటాం.
దేశంలో 4163అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిన్నింటిపై సంక్రాంతి తర్వాత కార్యచరణ ప్రారంభిస్తామన్నారు. దేశంలోని అన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఈసందర్భంగా అన్నారు. ప్రతి గుండెకు బాధను వివరిస్తే దేశం అద్భుతంగా భారతదేశం పురోగమిస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి…