మొక్కలు నాటిన బాలరాజు యాదవ్

64
- Advertisement -

తెలంగాణ సాధించుకున్న తర్వాత హరిత తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌…మానసపుత్రిక అయిన హరిత హారంను ప్రారంభించారు. హరిత తెలంగాణ దిశగా వేల కోట్ల మొక్కలు నాటుతూ వందలాది పశువులకు నీడనిస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమంను స్పూర్తిగా తీసుకోని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంఘం చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది ముగిసిన సందర్భంగా దూదిమెట్ల బాలరాజు యాదవ్ మొక్కలు నాటారు.

మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి…అనంతరం మొక్కలు నాటారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కమీషన్ సభ్యులు నూలి సుభప్రద్‌ పటేల్ మరియు TSSGDCFL inch.DD.సత్యనారయణ వెంకట్‌ గౌడ్‌ సాయిరాజ్‌ జాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి….

- Advertisement -