జనవరి 1…నూమాయిష్ ఎగ్జిబిషన్‌

59
- Advertisement -

అప్పటి నిజాం ప్రభుత్వ తీసుకున్న చొరవతో ఏర్పాటు చేసిన నూమాయిష్ ఎగ్జిబిషన్‌ నేటికి అలరారుతోంది. ఇది కేవలం వస్తు ప్రదర్శనలకోసమే గాకుండా వివిధ పారిశ్రామిక ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తారు. ఇందులో రూ.10 నుంచి లక్షల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులను ప్రదర్శనకు ఉంచుతారు. దీనిని మొదట్లో 1938లో ప్రారంభించారు.

నూమాయిష్‌ అనగా ఉర్దూ పదం తెలుగులో సంత ఇంగ్లీష్‌లో ఎగ్జిబిషన్ అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇది విస్తరిస్తూ నాంపల్లి మైదానంలోకి మార్చబడింది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా నూమాయిష్ ప్రదర్శన జరగలేదు. 82వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్ ను వచ్చే యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి 46రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఉత్పత్తులతో నుమాయిష్‌లో 2400స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  అయితే ఈసారి టికెట్‌ ధరను పెంచినట్టు ప్రకటించారు. గతంలో రూ.30 ఉండగా ఈ సారి రూ.40గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇది మధ్యాహ్నం 3గంటల 30నిమిషాల నుంచి రాత్రి 10.30వరకు ఉంటుందని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్క ప్రణాళికలతో ఏర్పాటు పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

2022… గూగుల్ శోధించిన వ్యక్తులు

ఆపబ్‌లలో న్యూఇయర్ వేడుకలు నిషేధం

రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు..

- Advertisement -