గ్యాస్ సమస్యలకు ఈ ఆసనంతో చెక్!

123
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడిలో పడి చాలా మంది టైమ్ కు భోజనం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఇలా టైమ్ కి భోజనం చేయకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా టైమ్ కి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు పెరుగుతాయి. ఈ గ్యాస్ సమస్య వల్ల కొద్దిగా ఆహారం తిన్న పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. దాంతో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గ్యాస్ సమస్య వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే ఈ గ్యాస్ సమస్యకు చెక్ పెట్టేందుకు యోగాలో పవనముక్తసనం ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ ఆసనం ఉదర సమస్యలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు.. పొత్తి కడుపు కండరాలను బలపరుస్తుంది.

ముందుగా కార్పెట్ లేదా దుప్పటి నేలమీద పరచుకొని దానిపై వెల్లికిలా ప్రశాంతంగా పడుకోవాలి. ఆ తరువాత బాగా గాలి పీల్చి రెండు కాళ్ళను పైకి లేపి చేతులతో మోకాళ్ళను మడిచి తొడలను కడుపుకు అదమాలి. తర్వాత శ్వాస వదిలి గడ్డన్ని మోకాళ్ళకు ఆనించేందుకు ప్రయత్నించాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలోనే ఉండి ఆ తరువాత నెమ్మదిగా తల మరియు కాళ్ళు కిందకి దింపాలి. ఇలా పవనముక్తసనం రోజులు 15-20 నిముషాలు చేయాలి. ఇలా ఈ ఆసనం ద్వారా ఉదర సమస్యలన్నిటికి చెక్ పెట్టవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఈ యోగాసనం వేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

  Also Read:భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం:పొంగులేటి

- Advertisement -