వీరయ్య ఇంట్రో.. డైరెక్టర్ మాటల్లో

1462
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి హీరోగా పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న సంక్రాంతి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గురించి ఫ్యాన్స్ కి కొన్ని క్రేజీ విషయలు చెప్పాడు దర్శకుడు బాబీ. సినిమాలో చిరంజీవి గారి ఇంట్రో ఎలా ఉండబోతుందో తెలుసా ? అంటూ అసలు సంగతి చెప్పాడు. సముద్రంలో అలలు , అలజడులతో తుఫాన్ వస్తుంటే కాసేపటికి ఆ కెరటాల మధ్యలో నుండి బోట్ తో చిరంజీవి  ఇంట్రో ఉంటుందని పది రోజుల పాటు వర్షంలో ఆ షూట్ చేశామని, టీం అందరూ వణుకుతూ వర్క్ చేస్తే చిరంజీవి గారు మాత్రం డూప్ లేకుండా ఆయనే స్వయంగా వర్షంలో యాక్ట్ చేశారని తెలిపాడు. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే ఇలాంటి సన్నివేశాలు ప్రతీ పది నిమిషాలకు ప్లాన్ చేశానని చెప్పుకున్నాడట బాబీ. రెండ్రోజుల క్రితం చిరంజీవి గారు సినిమా చూసి బ్లాక్ బస్టర్ అని చెప్తూ థాంక్యూ సో మచ్ బేబీ అన్నారు.

మెగా ఫ్యాన్స్ తో దర్శక నిర్మాతలు ప్రైవేటుగా పెట్టుకున్న ఈ మీటింగ్ లో కంటెంట్ గురించి అలాగే , థియేటర్స్ లిస్టు , బెన్ ఫిట్ షోల గురించి గట్టి చర్చే నడిచిందట. అన్ని అనుకున్నట్టే జరుగుతాయని నిర్మాతలు ఫ్యాన్స్ కి మాటిచ్చారని తెలుస్తుంది. ఏదేమైనా బాబీ డైరెక్షన్ లో రాబోతున్న వాల్తేరు వీరయ్య మీద భారీ అంచనాలున్నాయి. రవితేజ ఇందులో ఓ కీలక పాత్రలో నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దేవీ పాటలు ఇప్పటికే ఒక ఊపు ఊపెస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

30 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై రాధ..

వారి బండారం బయటపెట్టేస్తా

వాల్తేరు వీరయ్య..థర్డ్ సింగిల్

- Advertisement -