న్యూ ఇయర్..వెకేషన్‌కి మహేష్

202
- Advertisement -

సినిమా సినిమాకి ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు హీరో మహేష్. ఇప్పటికే ఈ ఏడాది అక్టోబర్‌లో లండన్‌ ట్రిప్ వేసిన మహేష్ తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా వెకేషన్‌కి వెళ్లారు. ఇవాళ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయంలో వెకేషన్ కి వెళుతూ కనిపించగా ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అయితే మహేష్ ఈసారి వెకేషన్ ఎక్కడికి వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తికాగా హీరోయిన్ పూజా హెగ్డే కాలుకి గాయం అయింది. దీంతో సెకండ్ షెడ్యూల్ లేటు అవుతూ వస్తుండగా తాజాగా మహేష్ వెకేషన్‌కి వెళ్లడంతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -