సొరకాయ రసంతో..ఇన్ఫెక్షన్స్ కు చెక్!

367
- Advertisement -

ఈ రోజుల్లో చాలమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉంటాయి. మూత్ర విసర్జన చేసే టైమ్ లో మంట లేదా దురద వంటి సమస్యలు అధికంగా వేదిస్తూ ఉంటాయి. కొందరిలో భరించలేనంత మంటతో పాటు దురద కూడా అధికంగానే ఉంటుంది. ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ స్త్రీ పురుషుల ఇద్దరిలోనూ కనిపిస్తాయి. అయితే ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తగ్గి లవణాల గాఢత పెరగడమే. ఈ విధంగా లవణాల గాఢత అధికశాతం పెరిగితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మన శరీరాన్ని సురక్షితంగా ఉంచడంలో మూత్ర పిండాలది కీలక పాత్ర. శరీర ద్రవల్లోని లవణాలను విసర్జించి నీటి సమతుల్యతను సరిగా ఉంచడంలో మూత్ర పిండాలదే ప్రదాన పాత్ర. .

అయితే లవణాల గాఢత అధికం అయినప్పుడు కిడ్నీలలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి. ఫలితంగా మూత్ర విసర్జన చేసే టైమ్ లో మంట, దురద లేదా నొప్పి వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్య తీవ్ర తరంగా ఉన్నప్పుడూ వైద్యుడిని సంప్రదించడం ఎంతో ఉత్తమం. అయితే మూత్ర విసర్జన చేసే టైమ్ లో కొద్దిపాటి మంట ఉంటే.. అలాంటప్పుడు చిన్న చిట్కా ల ద్వారా ఆ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో సొరకాయ రసం ఎంతగానో ఉపయోగ పడుతుందట. సొరకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అందువల్ల శరీరంలో నీటి సమతుల్యతను మెరుగుపరుచుతుంది. ఇక శరీరంలోని వేడి కారణంగా మూత్ర విసర్జనలో వచ్చే మంట, దురద వంటి సమస్యలను కూడా సొరకాయ రసం తగ్గిస్తుంది. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని లవణాల గాఢతను తగ్గించి మూత్ర విసర్జన సాఫీగా జరిగే విధంగా చూస్తుంది. అంతే కాకుండా సొరకాయ రసంలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను కూడా మెరుగు పరుచుతుంది. దాంతో మలబద్దకం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సొరకాయ రసాన్ని ఉదయాన్నే పడిగడుపున తాగడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -