రాష్ట్రపతి పర్యటన….షెడ్యూల్‌ ఇదే

90
- Advertisement -

భారత రాష్ట్రపతి శీతాకాల విడిదికోసం ఈనెల 26న హైదరాబాద్‌కు రానున్నారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ద్రౌపది ముర్ము వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి 26న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకుంటారు. డిసెంబర్ 30న సాయంత్రం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

తెలంగాణలోని కాకాతీయుల కాలం నాటి నిర్మాణమైన రామప్ప దేవాలయంను ఈనెల 28వ తేదీన సందర్శించనున్నారు. దీనితో పాటు 29న యాదాద్రిలో పర్యటించనున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా శ్రీశైలం దేవాలయంను సందర్శించనున్నారు.

హైదరాబాద్‌లోని సమతామూర్తిని దర్శించుకొనున్నారు. కేశవ్‌ మెమోరియల్ సొసైటీ, జీ.నారయణమ్మ కళాశాలను పర్యటించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. దేశ భద్రత వ్యవస్థకు సంబంధించిన నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్లి ట్రైనీ అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. డిసెంబర్‌ 29న సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు, ఉన్నతాధికారులతో కలిసి తేనీటి విందులో పాల్గొంటారు.

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రయాణికులు తమ తమ రూట్లను మార్చుకొని గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేయాలని అధికారులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఇప్పటికే అదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రపతి నిలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డుల పర్యవేక్షణలో రాజీవ్ రహదారి నుంచి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇవి కూడా చదవండి…

బి‌ఆర్‌ఎస్ తోనే మార్పు తథ్యం !

తెలుగువాళ్ళంటే కేంద్రానికి ఇంత చిన్నచూపా ?

ఇంధన పరిరక్షణకు తెలంగాణకు అవార్డు

 

- Advertisement -