దర్శకుడు పరుశురామ్ తన తర్వాత సినిమా బాలయ్యతోనే అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఐతే, పరుశురామ్ ప్రస్తుతం బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేశాడు. ఇటీవల బాలయ్యను కలిసి కథ మొత్తం చెప్పేశాడని, ‘పరుశురామ్ కథ’ బాగుంది అంటూ బాలయ్య కూడా ఈ ప్రాజెక్టుకి యస్ చెప్పేశారని తెలుస్తోంది. నిజానికి కథ బాగా నచ్చినా బాలయ్య ఈ సినిమాకు వెంటనే డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అనిల్ రావిపూడి సినిమా కోసం బాలయ్య బల్క్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయినా పరుశురామ్ కథ తనకు అద్భుతంగా నచ్చడంతో ఇప్పుడు బాలయ్య తన సినిమాల ప్లానింగ్ ను కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలని నిర్ణయించకున్నారట.
ఇందులో భాగంగా జనవరి నుంచి పరుశురామ్ సినిమాకి కూడా డేట్లు ఇవ్వాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ పరుశురామ్ రాసుకున్న ఈ కథ దేని పై ఉంటుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. పరుశురామ్ రాసుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో బాలయ్య సీఎంగా కనిపించనున్నారట. పైగా సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి కాస్త దగ్గరగా కూడా ఉంటుందని.. అలాగే ఇప్పటి రాజకీయాలను, రాజకీయ నాయకుల ఆలోచనా విధానాన్ని సెటైరికల్ గా ఈ చిత్రంలో పరుశురామ్ చూపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పైగా ఈ కమర్షియల్ సినిమాలో బాలయ్య ఓ ప్రయోగాత్మక పాత్రలో కూడా నటిస్తున్నాడు.
మరీ నిజంగానే బాలయ్య పాత్రలో ఆ ప్రయోగం గానీ కుదిరితే.. బాలయ్య కెరీర్లో ఇదో కొత్త తరహా సబ్జెక్ట్ అవుతుందని పరుశురామ్ గట్టిగా నమ్ముతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో వీరసింహా రెడ్డి సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా రొట్ట కొట్టుడు అండ్ రెగ్యులర్ యాక్షన్ డ్రామా. మరీ ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…