వైరల్ : రవి తేజ ఫోటో షూట్

18
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ నుండి డిసెంబర్ లో ఒక సినిమా జనవరి లో మరొక సినిమా రాబోతుంది. ఈ నెలలో ధమాకా తో థియేటర్స్ లోకి వస్తున్న రవితేజ వచ్చే నెల సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రవితేజ కూడా ఈ ప్రాజెక్ట్స్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. క్రాక్ తర్వాత వరుస ఫ్లాపులు డెలివరీ చేసిన రవితేజ ధమాకా తో ఈ సారి నిరాశ పరచడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉన్న రవితేజ ఈ మధ్య కాలంలో తన ఫ్యాన్స్ ను కలవలేదు. తాజాగా వారిని కలిసి ఫోటో షూట్ పెట్టుకున్నాడు. రవితేజ ఫ్యాన్ షూట్ షూట్ అనే వర్డ్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చారు. అయితే ఈ ఫోటో షూట్ లో రవితేజ ఒక వికలాంగుడితో కర్ర పట్టుకొని దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ వైరల్ అవుతుంది.

అంతే కాదు చిన్న పిల్లల కోసం రవితేజ కింద మోకాలితో కూర్చొని దిగిన ఫోటో కూడా మాస్ మహారాజా మంచితనానికి నిదర్శనం అంటూ చక్కర్లు కొడుతుంది. ఏదేమైనా ఫ్యాన్స్ కి ఫోటో షూట్ పెట్టి వారికి ఓ బెస్ట్ మూమెంట్ ఇచ్చి రవితేజ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. మరి ధమాకా . వాల్తేరు వీరయ్య రవితేజ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -