బంగ్లాదేశ్ టూర్‌లో ఘోరంగా విఫలమైన భారత జట్టుకు శ్రీలంక న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో మూడు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో వన్డేలు, టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను విడదల చేసింది. వచ్చే యేడాది జనవరి నుంచి మార్చి వరకు ఈ సిరీస్‌లు జరుగనున్నాయి. ఆస్ట్రేలియా తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఉంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఇదే చివరి సిరీస్. ఆ తర్వాత ఈ ట్రోఫీ రద్దవుతుంది. ఇవన్నీ దేశీయంగా జరిగే సిరీస్‌లే. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
షెడ్యూల్ వివరాలు.. శ్రీలంక సిరీస్: ఇందులో మూడు టీ20లు, మూడు వన్డేలు ఉంటాయి. జనవరి 3,5,7 తేదీల్లో టీ 20లు, 10,12,15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. తర్వాత న్యూజిలాండ్ సిరీస్ ఆరంభమవుతుంది. ఇందులో కూడా మూడు వన్డేలు, మూడు టీ20లు ఉంటాయి. జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు వన్డేలు, జనవరి 27, 29, ఫిబ్రవరి 1న మూడు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభమవుతుంది. ఇందులో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఉన్నాయి. ఫిబ్రవరి 9-13 వరకు మొదటి టెస్ట్, 17-21 వరకు రెండో టెస్ట్, మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. తర్వాత మార్చి 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌లు తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో జనవరి 18న జరిగే మొదటి వన్డే హైదరాబాద్‌లో, ఆస్ట్రేలియాతో మార్చి 19న జరిగే రెండో వన్డే విశాఖపట్నంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి…