- Advertisement -
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుపానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉందని, శుక్రవారం అర్ధరాత్రికి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.
తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు, పుదుచ్చేరి, కరైకల్‌లో నేడు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
- Advertisement -