అధికారుల అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ కమెడియన్ కపిల్‌శర్మ చుట్టూ వివాదాల ఉచ్చు బిగుసుకుంటోంది. అక్రమ కట్టడాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు అందడంతో అతడిపై ఓషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. కపిల్‌శర్మతో పాటు మరో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌పై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దోషులుగా తేలితే వీరికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్‌లోని డీఎల్‌హెచ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు.
ఒషివారా ప్రాంతంలోని డీహెచ్‌ఎల్ ఎన్‌క్లేవ్‌లో ఐదో అంతస్థులో ఇర్ఫాన్‌ఖాన్, తొమ్మిదో అంతస్థులో కపిల్ ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నిబంధనలు అతిక్రమించి వీరు తమ ఫ్లాట్లలో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్నారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సబ్ ఇంజినీర్ అభయ్ జగతప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది.
పీ-సౌత్ వార్డ్ సబ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అపార్ట్ మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్(ఎంఆర్ టీఎస్) 1996 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 వేలు నుంచి రూ.5 వేలు జరిమానా విధిస్తారు.
ముంబై మున్పిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తనను రూ.5లక్షలు లంచం అడిగారంటూ కపిల్ ఇటీవల సంచలన ట్వీట్ చేశాడు. కపిల్ ట్వీట్‌కు స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
చిక్కుల్లో నటులు కపిల్, ఇర్ఫాన్
- Advertisement -
- Advertisement -