పవర్ ప్యాక్ అప్‌డేట్!

146
pawan
- Advertisement -

ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. ఇప్పటికే పలు ప్రాజెక్టులు పవన్‌ చేతిలో ఉండగా తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. సాహో దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుంది.

ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించి పోస్టర్ ను ఇవాళ విడుదల చేశారు. ఇందులో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారని క్యాప్షన్ ఇచ్చారు.

రవి.కె.చంద్రన్ డీవోపీ అందిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఇక ప్రస్తుతం పవన్‌ హరి హర వీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -