తెలంగాణకే ఆదర్శంగా మునుగోడు..

252
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌ ద్వారానే రాబోయే ఆరేడు నెలల్లో రూ.100కోట్లతో రహదారుల విస్తరణ చేయబోతున్నాం. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.170కోట్లు వెచ్చించబోతున్నాం. మున్సిపల్‌శాఖ నేతృత్వంలో చండూరు మున్సిపాలిటీకి రూ.30కోట్లు, చౌటుప్పల్‌కు రూ.80కోట్లు కేటాయిస్తున్నాం.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రూ.25కోట్లతో రోడ్ల నిర్మాణానికి వెచ్చించబోతున్నం. విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా రూ.8కోట్లతో 33/11 ఐదు సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నం అని ప్రకటించారు.

దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక పార్కును ఆనుకొని ఈ ప్రాంత 10వేల మంది పిల్లలకు ఉపాధి కల్పించేందుకు టాయ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. ఆటవస్తువులు తయారు చేసే కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే భూమిపూజ చేస్తాం. చండూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

నారాయణపూర్‌ మండలంలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నాం. సేవాలాల్‌ బంజారా భవన్‌ను సంస్థాన్‌ నారాయణపూర్‌ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు రూ.కోటి మంజూరు చేసి.. మునుగోడులో అందుబాటులోకి తీసుకువస్తాం. కొత్తగా నాలుగు హ్యాండ్‌లూమ్‌ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేస్తాం. భువనగిరి హెడ్‌ క్వార్టర్స్‌లో ఒకటి, నారాయణపూర్‌లో ఒకటి, గట్టుప్పల్‌లో ఒకటి, పెరటికల్‌లో ఒకటి చొప్పున ఏర్పాటు చేసి, అందుబాటులోకి తీసుకువస్తాం.

నేతన్నలు యార్న్‌ సబ్సిడీని 40శాతం మొదట కట్టి తర్వాత తీసుకోవాల్సి వస్తుందని, కొంత జాప్యం జరుగుతుందని నేతన్నలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

ఇవి కూడా చదవండి…

జైల్లో పెడతారా..దేనికైనా సిద్ధం: కవిత

బీజేపీ వదిలిన బాణం..కవిత సెటైర్

రూ.200 కోట్ల నిధులతో కంటివెలుగు-2

- Advertisement -