సినిమాలో లిప్ లాక్ ఉందంటే చాలు.. ఆ మూవీపై టాక్ పెరిగిపోతుంది. అందరి దృష్టిని లిప్ లాక్ అనే పదం ఆకర్షిస్తుంది. కానీ లిప్ లాక్, లేక మామూలు చుంబనం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఎన్నో రీసెర్చ్ లలో తేలింది. ఈ ముద్దుల వల్ల గుండెకు, ఊపిరితిత్తులకే కాదు ఓవరాల్ గా మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసే ఇటీవల ‘కిసెంజర్’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఎదుటివారికి ఫోన్ ద్వారా ఈ పరికరంతో ముద్దు పంపితే.. అవతలి వ్యక్తి అదే అనుభూతిని పొందుతారు.
Also Read:మలబద్దకం…పరిష్కారాలు..
లిప్ కిస్, కిస్ వల్ల కలిగే ప్రయోజనాలు ..
లిప్ కిస్ మనల్ని ఒత్తిడిని దూరం చేస్తుంది. ముద్దు పెట్టుకునేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలయి మనసును ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఎండార్ఫిన్ హార్మోన్ అయితే మంచి అనుభూతిని ఇస్తుంది.
కేలరీలను కరిగిస్తుంది. ఒక నిమిషం పాటు గాఢంగా చుంబిస్తే 26 కేలరీలు కరుగుతాయి.
కొవ్వును తగ్గించడంతో పాటుగా బీపీని నియంత్రిస్తుంది. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేందుకు ముద్దు దోహదం చేస్తుంది.
తలనొప్పి లాంటి సమస్య నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది
లిప్ కిస్ చేయాలంటే 34 ముఖ కండరాలు కదలాల్సిందే. వీటి కదలికలతో ముఖంపై చర్మానికి ఎక్సర్ సైజ్ అవుతుంది
శ్వాసక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. దంతాలకు మేలు చేస్తుంది.
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మనలో పునరుత్తేజాన్ని కలిగిస్తుంది.
భాగస్వామితో ఎలాంటి కలహాలు లేకుండా సంసారం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పోత్ర పోషిస్తుంది
ప్రతిరోజు ఉదయం ముద్దుపెట్టుకునే వారి ఆయుష్షు మరో ఐదేళ్లు పెరిగే అవకాశాలున్నాయని గతంలో కొందరు నిపుణులు తెలిపారు.
Also read:బాదం, పల్లీలతో లాభాలెన్నో!