టిఫా స్కానింగ్‌తో ఆరోగ్య తెలంగాణ

179
- Advertisement -

ఆరోగ్య తెలంగాణగా మరో ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సర్కార్‌ దావాఖానల్లో గర్భిణులు సౌకర్యార్థం కొత్తగా టిఫా స్కానింగ్ యంత్రాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా స్కానింగ్‌ యంత్రాలను పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ…100 మందిలో ఏడుశాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్‌తోనే గుర్తించడం సాధ్యమన్నారు.

పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని, రాష్ట్రంలో 99.2శాతం ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలు జరిగాయన్నారు. రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో సాయంతో నెలకు 20వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు వీలు కలుగనున్నది.

ప్రైవేటు దవాఖానాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చయ్యే ఈ స్కానింగ్‌ను ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగానే చేయనున్నారు. మిషన్ల సహాయంతో తల్లిగర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే సులువుగా గుర్తించవచ్చని తద్వారా, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు వీలు ఉంటుంది. 18 నుంచి 22 వారాల మధ్యలో టిఫా స్కానింగ్‌ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…

దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ముందంజ..

రామప్ప తెలంగాణ వారసత్వము:వీ.ప్రకాశ్‌

- Advertisement -