- Advertisement -
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల రిమాండ్‌ని పొడగించింది ఏసీబీ కోర్టు. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీల రిమాండ్ ను డిసెంబర్ 9వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ముగ్గురిని చంచల్ గూడా జైలుకు తరలించారు.
ఇక ఈ కేసులో ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేయగా దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. ఇక ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ స్పెషల్ కోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ముగ్గురు నిందితులను ఇప్పటికే రెండురోజుల కస్టడీకి అనుమతించామని, మరోసారి కుదరదని సిట్ అధికారులకు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -