నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్ రేటింగ్‌లో నిలిచింది. తాజాగా సెకండ్ సీజన్ ఇటీవలె ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని తిరగరాసింది. ఫస్ట్ సీజన్ రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక ఈ షోతో ఆహా ఓటీటీకి సబ్‌స్కైబర్లు కూడా పెరిగారు. మరి ముఖ్యంగా ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాల్లో బాలయ్యని మొరటోడుగా ఊహించుకున్న వారికి అన్‌స్టాపబుల్‌తో ఇంత ఫ్రెండ్లీనా అన్నట్లు కనెక్ట్ అయ్యారు. అగ్రహీరో అన్న గర్వం ఏమాత్రం లేకుండా అందరితో ఇట్టే కలిసిపోతారనే విషయం తెలిసింది.
ఈ నేపథ్యంలో బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‌కి బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటుకున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 5 సీజన్లతో పోలీస్తే ఈ సీజన్ చప్పగా సాగుతోంది. దీంతో వచ్చే సీజన్‌కి మరింత పాపులారిటీ రావాలంటే బాలయ్య రావాలని ఫ్యాన్సే కాదు అంతా భావిస్తున్నారు. వాస్తవానికి బిగ్ బాస్‌లో ఇప్పటివరకు ఎన్టీఆర్,నాని తర్వాత నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది హోస్ట్‌ని మారుస్తారనే ప్రచారం జరిగినా అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.
అయితే గత సీజన్లతో పోలీస్తే ఈ సీజన్ పూర్తిగా తేలిపోవడంతో బాలయ్య రావాలని అప్పుడే బిగ్ బాస్ తెలుగుకు మరింత పాపులారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అన్‌స్టాపబుల్‌తో నిజంగా ప్రేక్షకుల గుండెల్లో అన్‌స్టాపబుల్‌గా మారారు బాలకష్ణ. ఈ షోకు వస్తున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని బాలయ్య అయితేనే హోస్ట్‌గా బాగుంటుందని అంతా భావిస్తుండగా దీనిపై నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి. ఒక వేళ బాలయ్య హోస్ట్‌గా వస్తే బిగ్ బాస్‌కు బూస్ట్ రావడం ఖాయం.
ఇవి కూడా చదవండి..