ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా వస్తున్న ‘హను-మ్యాన్’ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ లో.. పవర్ ఫుల్ షాట్ మేకింగ్, షార్ప్ కట్టింగ్ షాట్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన దృశ్యాలతో పాటు టాప్ క్వాలిటీ VFX వర్క్ తో టీజర్ ను నింపేశారు. ముఖ్యంగా కెమెరామన్ శివేంద్ర వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గుడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అన్నిటికీ మించి రామ భక్తి తో ఉన్న ‘హను మాన్’ను మరింత పవర్ ఫుల్ గా చూపించారు. టీజర్ వరకు ఆకట్టుకునేలా ఉంది. కానీ, ఈ టైపు కంటెంట్ తో ఒక సమస్య ఉంది. టీజర్లు ట్రైలర్ల వరకు బాగుంటాయి. షాట్స్ కట్ చేయడానికి, కంటెంట్ ఎలివేట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ గా అనిపిస్తాయి.
కానీ అసలు సమస్య.. సినిమాని ఇదే కంటెంట్ తో రెండు గంటల పాటు నడపాలి. అదే అసలైన ఛాలెంజ్. స్క్రీన్ ప్లే ఎఫెక్టివ్ గా ఉండాలి. కానీ, ప్రశాంత్ వర్మకి షాట్ మేకింగ్ తెలిసినంత బాగా.. స్క్రీన్ ప్లే తెలియదు. ఆయన గత సినిమాలలో స్క్రీన్ ప్లేనే మెయిన్ లోపం. దీనికితోడు ఈ చిత్రం పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతుంది. పైగా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలోనూ ఒకేసారి రిలీజ్ కాబోతుంది. మరి ఈ “హను మాన్” పరిస్థితి ఏమిటో చూడాలి. ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా సందడి చేయబోతుంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. ప్రశాంత్ వర్మ గత చిత్రం జాంబి రెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకున్న కారణంగా.. నిర్మాతలు ఈ ‘హను-మ్యాన్’ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు.
‘హను-మ్యాన్’ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి..