1969లో ఏర్పాటైన ఇస్రో..అతి తక్కువ కాలంలో ఎన్నో మైలురాలు దాటింది. నాసా, స్పేస్ ఎక్స్, యూరోపియన్ యూనియన్ కంటే అతి తక్కువ కాలంలో ఎదిగిన ఇస్రో..తాజాగా మరో మైలురాయిని దాటింది. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది.
హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. విక్రమ్ సారాభాయ్ పేరుమీద దీనికి విక్రమ్-ఎస్ అని నామరకణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ ఉన్నాయి.
Mission Prarambh is successfully accomplished.
Congratulations @SkyrootA
Congratulations India! @INSPACeIND pic.twitter.com/PhRF9n5Mh4— ISRO (@isro) November 18, 2022
ఇవి కూడా చదవండి..