మెడికల్ ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ రంగంలో తెలంగాణకు నేడు విశిష్టమైన దినం అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఆయన బృందానికి, డాక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 57 ఏండ్లలో కాలంలో తెలంగాణలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఈ 8 ఏండ్లలో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
మెడికల్ రంగంలో కొత్తగా జర్నీని ప్రారంభించబోతున్న విద్యార్థులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని, దాంతో పాటు 33 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
My wholehearted compliments to Health Minister @trsharish Garu and his team of able Officials, Doctors and best wishes to the students who begin a new journey today
Along with 33 Medical colleges (one per district), 33 Nursing colleges are also being setup
All by Telangana Govt
— KTR (@KTRTRS) November 15, 2022
Our Chief Minister KCR sir yet again proves that he walks the talk.
Keeping up his promise to build a healthy Telangana , CM KCR ji will be inaugurating 8 Medical Colleges in different districts today#AarogyaTelangana pic.twitter.com/apCoYYPFSU— krishanKTRS (@krishanKTRS) November 15, 2022
ఇవి కూడా చదవండి..
8వైద్య కాలేజీలను ప్రారంభించిన సీఎం
కృష్ణ పార్థీవ దేహంకు నివాళులు ఆర్పించిన సీఎం
ఓ శకం ముగిసింది..తరతరాలకు ఆదర్శం వీరు!