తెలంగాణలో మీ కుట్రలు సాగవు:జగదీశ్‌

223
- Advertisement -

ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 250మంది ఇంజినీర్‌లకు నియామక పత్రాలు అంజేసిన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి. ఎర్రగడ్డలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..24గంటల ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ రంగంకు కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 5600 మెగావాట్స్‌ ఉత్పత్తి ఉన్న కోతలు లేకుండా సరఫరా చేయలేదని మండిపడ్డారు. కానీ తెలంగాణ 24గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నామని అన్నారు. మరీ ఏ రాష్ట్రం కూడా ఈ ఘనతను సాధించలేరని తెలిపారు. భారతదేశంలో అత్యంత గొప్పగా రికార్డు స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తిని వినియోగిస్తున్న రాష్ట్రమన్నారు. విద్యుత్‌ రంగంలో ఉద్యోగుల కొరత లేదన్నారు. రికార్డు స్థాయిలో ముందస్తుగానే ప్రభుత్వం నియామాకాలు చెపట్టిందన్నారు. ఒప్పంద ఉద్యోగులను కూడా శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రంలో కొత్తగా22300 కేవీ సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్రంలో ప్రతిమూలకు కరెంట్‌ను పంపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నాడు ఉద్యమ సమయంలో ఏం చేప్పామో వాటిని నేరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. విద్యుత్‌ రంగంలో కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టి తెలంగాణ ప్రజలకు 24గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని …ఇంత పెద్ద స్థాయిలో ముందుండి నడిపించిన సీఎండీలకు అందరూ ఇంజినీర్‌లకు ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తున్నా. గొప్పలు చెప్పుకొనే తిరిగేవాళ్లు గుజరాత్‌లో ఎందుకు పవర్ హలీడే ఎందుకు ఇచ్చారో దేశప్రజలందరికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌కు సీఎం కేసీఆర్‌ భయం పట్టుకుందని అన్నారు. తెలంగాణలో అమలువుతున్న పథకాలు దేశమంతటా విస్తరిస్తున్నాయని అన్నారు.

తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ను వీడదీయాలని కుట్రలు జరుగుతున్నాయని వాటిని ప్రజలే తిప్పి కొట్టారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మునుగోడులో ఎన్ని కుట్రలు చేసిన గెలిచి చూపించామని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఆఫీస్‌ ఒకటి నాంపల్లిలో ఉంటే మరోటి రాజ్‌భవన్‌లో ఉందని మండిపడ్డారు. గవర్నర్ తన స్థాయి దిగజార్చుకొని తెలంగాణలో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాలో కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని అవి ఫలించవని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉన్నంతవరకు రాష్ట్రంలో విద్యుత్‌ కొరతలు ఉండవని మంత్రి అన్నారు. యాసంగిలో కూడా రైతులకు 24గంటలు విద్యుత్‌ సరఫరా ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎంత డిమాండ్ వచ్చిన రైతుల కోసం విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఇందుకోసం సీఎం కేసీఆర్‌ ఆహర్నీశలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎంత మంది ఎన్ని వేషాలు వేసిన కేసీఆర్‌ను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

మంచి మనసు ఉన్న మన కేటీఆర్‌

మహేష్ కి దెబ్బ మీద దెబ్బ !

కుర్ర హీరోను సాంతం నాకేస్తోందట

- Advertisement -