ప్రతిష్మాత్మక ఫార్ములా రేస్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. దీనికి హైదరాబాద్ ఆతిథ్యం దక్కించుకోవడం గొప్ప విషయం. ఈ నెల 19 తొలి డిసెంబర్ 10న ఫైనల్ ఈ రేస్ ట్రయల్ రన్ జరగనుంది.
ఈ రేసు కోసం హెచ్‌ఎండీఏ హుస్సేన్ సాగర్ చెరువు సమీపంలో రేస్ కోసం అనువైన ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ఫార్ములా రేసింగ్ కోసం సుమారు 2.8 కిలో మీటర్ల మేర ట్రాక్ నిర్మించగా ఈ రేస్‌లో పాల్గొనే డ్రైవర్ల విశ్రాంతి గదులు, ప్రేక్షకుల గ్యాలరీలను రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకు 9 నగరాల్లో మాత్రమే ఈ రేస్ నిర్వహించారు.
ఈ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో చెట్లను తొలగించి రీలొకేట్ చేశారు. ఫార్ములా ఈ రేస్లో 5 టీంలు, 20 కార్లు పాల్గొంటాయి. ఇందులో మహీంద్రా, జాగ్వర్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఈ రేస్ 280 కిలోమీటర్ల మేర మాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బుక బై షో ద్వారా టికెట్ల అమ్మకాలను నిర్వాహకులు ప్రారంభించారు. హైదరాబాద్ క్లాక్ రైడ్స్,స్పీడ్ డిమోన్స్ ఢిల్లీ,బెంగళూరు స్పీడ్‌స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్ జట్లు పాల్గొననున్నాయి.
ఇవి కూడా చదవండి..