జిమ్‌ చేస్తే మరణించాలా…?

237
- Advertisement -

జిమ్‌ అంటే ఎంతమందికి ఇష్టముండదు…సిక్స్ ప్యాక్స్ దేహం, కండలు మెలితిరిగి శరీరాలు, యవ్వనంగా కనిపిస్తూ రోజూ జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తే ఫిట్ గా ఉంటామనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. మరీ ఎక్కువగా 35 నుంచి 46 మధ్య ఉన్న యువకులకు ఎందుకు హార్ట్‌ ఆటాక్ వస్తుంది.  ఆరోగ్యం కోసం పాటుపడే యువకులకు రావడమేంటి ఇదేప్పుడూ మన బ్రెయిన్‌లోకి రాలేదు కాదా.

గుండె కూడా ఒక కండరం అనే విషయం తెలియదా..! ఉదయం, సాయంత్రం ఎప్పుడైనా వ్యాయమం చేయడం మంచిదా? లేదా కేవలం ఉదయం జిమ్ చేయడం మంచిదా?.. అసలు యోగా ఎందుకు చేయరు? ఈ యువత ఇలాంటి ప్రశ్నలకు మదిని తొలిచి సమాదానాలు వెతకాలని ఉన్న దొరకవు. ఎందుకు? డాక్టర్లకు అంతు చిక్కడం లేదా గుండె పోటుతో మరణించడం. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది.

2020 జూన్ 7న కన్నడ నటుడు చిరంజీవి సర్జా (హీరో ఆర్జున్‌ మేనల్లుడు) హార్ట్ ఎటాక్ తో మరణించారు. 2021 సెప్టెంబర్ 2న టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. 2021 అక్టోబరు 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో కన్నుమూశారు. 49ఏళ్ల వయసులోనే ఆయన చనిపోవడాన్ని కుటుంబ సభ్యులతో పాటు కన్నడ అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.

2022 జూన్‌ 1న సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నాత్‌) కోల్‌కత్తాలో మరణించారు. ఓ లైవ్‌ షో తర్వాత తిరిగిరాని లోకాలకు పయనమైపోయారు. కేకే మరణానికి కారణం గుండెపోటు అని కలకత్తా మెడికల్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. అప్పటికి కేకే వయస్సు 53సంవత్సరాలు.

2022 సెప్టెంబర్ 21న కమెడియన్ రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. చివరకు హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు వ్యాయామాలు చేస్తూ మరణించారు. 2022 నవంబర్‌ 11న శుక్రవారం నాడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రముఖ టీవీ నటుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ మృతిచెందారు.

కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత కూడా నటులు ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరం కానీ వాళ్లకి తెలియదు అదొక తీరని మచ్చగా భవిష్యత్‌ సమాజానికి తాము గుర్తులుగా మిగిలిపోతున్నామని ఎందుకంటే కొత్తదనం కోరుకున్నంత కాలం పాతది రోతగా మారుతుంది. కానీ యోగాని మించిన గురువు లేదు..వైద్యం లేదు.

 యోగా చేయడం ద్వారా మనసు శరీరం చాలా ధృడంగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు యోగాను ఆస్త్రంగా మలుచుకొని దీర్ఘాయుష్షును పొందగలిగారు. కానీ మనం జిమ్ అంటూ లేనిపోని స్టంట్స్‌ చేసి ప్రాణాలను కోల్పోయి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిపోతున్నాం. కాబట్టి అతిగా తింటే అన్నం కూడా విషంగా మారుతుందని పెద్దలు చెప్పుతారు. కాబట్టి అతిగా ఏ పని చేయకూడదు.

ఇవి కూడా చదవండి..

గంగపుత్రులకు శుభవార్త :హరీశ్‌రావు

స్టీవ్ పాతచెప్పుల వేలం ఎక్కడో తెలుసా..

ఉత్త ప్రధాని..చేతల సీఎం: కవిత

- Advertisement -