రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఆఫర్లకి మిగతా టెలికం కంపెనీలకు దిమ్మతిరిపోయింది. ఆఫర్ల మీద ఆఫర్లతో కస్టమర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసిన జియో సక్సెస్ అయిందనే చెప్పాలి. దీంతో మిగతా కంపెనీలు కూడా జియో దెబ్బకి ఆఫర్ల వల వేయక తప్పలేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఐడియా కూడా ఆఫర్ల తో ముందుకొస్తుంది.
ఇప్పటికే పలు ఆఫర్లని ప్రకటించిన ఐడీయా, ఇప్పుడు మళ్ళీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డేటా జాక్‌పాట్ ఆఫర్‌ను వినియోగదారులకు తీసుకొచ్చింది. కేవలం రూ.100 రీఛార్జ్ తో 10 జీబీ వరకు డేటాను అందిస్తున్నట్లు ప్రకటించింది ఐడియా. 100 రూపాలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు 10 జీబీ వరకూ డేటా అందిస్తామని, కనీసం 1 జీబీ డేటాను ఇవ్వనున్నామని చెప్పింది.
అలాగే మూడు నెలలు పాటు ముగిసిన తర్వాత కూడా నెలకు 1 జీబీ చొప్పున డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మై ఐడియా ద్వారా ఈ ఆఫర్ అందుబాటులోకి ఉంటుందని. ఇతర టెలికాం సంస్థలు కూడా ప్రత్యేక డేటాను అందిస్తున్న విషయం తెలిసింది.
ఐడియా ప్రిపెయిడ్ కస్టమర్ల కోసం తమ పరిధిని బట్టి రూ.348 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాను అందిస్తుంది. ప్రస్తుతం రోజుకు 500 ఎంబీ డేటా చొప్పున వాడుకునే వీలుంది.. దాన్ని 1 జీబీకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 4జీ స్మార్ట్ ఫోన్లు వాడే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఈ క్రేజీ ఆఫర్ ని ప్రకటించిన ఐడియా ఇంకెన్ని ఆఫర్లని అందిస్తుందో చూడాలి.