- Advertisement -
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. మారేడుముల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు నరేష్.
ఇక ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 12 విడుదల కానుందని తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 11న థియేటర్లలో ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ముందుగా అనుకున్నట్లుగా నవంబర్ 12న డిజిటిల్ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -