- Advertisement -
ఎంపీ నవనీత్ కౌర్‌కు షాకియ్యింది ముంబై కోర్టు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్‌సభ ఎంపీ నవనీత్ రాణా, ఆయన తండ్రిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సర్వీస్ ఆఫ్ వారెంట్‌పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు.
వారెంట్ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరగా ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎంపీ నవనీత్ రాణా, ఆమె తండ్రి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.
ఈ మేరకు ముంబైలోని ములుంద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు నమోదైంది. అయితే, షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయిన స్ధానం అమరావతి నుండి ఎంపీగా గెలిచారు నవనీత్.
ఇవి కూడా చదవండి..
- Advertisement -