బీజేపీకి చెంపపెట్టు ఈతీర్పు:కేటీఆర్‌

233
- Advertisement -

మునుగోడులో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని అనడానికే ఈ ఉప ఎన్నిక నిదర్శనమన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ వెంట ఉన్న సీపీఐ, సీపీఎం నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

2018 రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తర్వాత తెలంగాణలో హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపించిన నల్గొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని కేటీఆర్‌ అన్నారు. ఉమ్మడి నల్గొండలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

రాజకీయాల్లో హత్యలు ఉండవు…ఆత్మహత్యలు ఉంటాయని ఈ సందర్బంగా కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయడానికి కంకణం కట్టుకున్న బీజేపీ కి చెంపపెట్టులాంటిదన్నారు. దేశంలో మోదీ, అమిత్‌షా లు చేసింది ఏమి లేదన్నారు. పైగా మోదీకి, షాలకు మునుగోడు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పరాని అన్నారు. ప్రజా ప్రభుత్వాలను కూల్చే ప్రతినిధులకు ఇదొక చెంపపెట్టులాంటి తీర్పన్నారు.

దిల్లీ లోని పెద్దలు సంచుల కొద్ది డబ్బుల తెచ్చి మునుగోడులో పంచిన… ప్రజలు అభివృద్దికే ఓటు వేశారని అన్నారు. ఈ ఉప ఎన్నికల సమయంలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ పీఏ రూ.90లక్షలతో దొరికాడని అన్నారు.

మునుగోడులో బీజేపీ నాయకుల విషప్రచారం చేశారని వాటిని ప్రజలు నమ్మకుండా గట్టిగా గుణపాఠం…. ఓటు ద్వారా తెలియజేశారన్నారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి హవాలా రూపంలో రూ.2.5కోట్లతో వివేక్‌కు సంబంధించిన వ్యక్తికి దొరికారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన సంస్థల నుంచి రూ.75 కోట్ల ట్రాన్స్ఫర్‌ జరిగాయి అని అన్నారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నికల నుంచి రాష్ట్రంలో ఎన్నిక ధనమయమైందని బాధపడ్డారు. హుజురాబాద్‌ లో ఈటెల విచ్చలవిడిగా ధనం పంచిపెట్టిండని మండిపడ్డారు. అలాగే మునుగోడులో పైసలు పంచడానికే సిద్దమైన బీజేపీ వాళ్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చామని తెలిపారు. ఎన్నికలంటే మొత్తం ధనమయమైందని కలుషితము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మునుగోడులో గెలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 15కంపెనీల సీఆర్‌పీఎఫ్‌, 40ఐటీ బృందాలను తెచ్చిన…. టీఆర్‌ఎస్‌ ఓటమి చెందదని మునుగోడు ప్రజలు నిరూపించారని అన్నారు. వందల కోట్లు దొరికినప్పుడు ఈసీ ప్రేక్షక పాత్ర వహించడం హాస్యస్పదంగా ఉందన్నారు. కేవలం బీజేపీ ప్రభుత్వాన్నికి మాత్రమే ఈసీ కొమ్ముకాసిందని మండిపడ్డారు.

కారును పోలిన గుర్తుల వల్ల టీఆర్‌ఎస్‌ పార్టీ దాదాపుగా 6000ఓట్లు పోయాయని…దీని కారణం ఈసీ అని అన్నారు. మేము ఎన్నిసార్లు విన్నవించుకున్న మా అభ్యర్థనను తొసిపుచ్చారని మండిపడ్డారు. కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను తీసివేయాలని మరోకసారి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

టీఆర్ఎస్‌ దుబ్బాక, హుజురాబాద్‌లో ఓడిపోతే…. హుందాగా మా ఓటమిని ఒప్పుకున్నామని అన్నారు. కానీ మునుగోడులో బీజేపీ ఓడిపోతే…. ఇతరులపై నిందలు వేస్తారని అన్నారు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని అని సూచించారు.

ఫాంహౌస్‌ ఘటనలో వచ్చిన బ్రోకర్లు ఈవీఎంలను కూడా తారుమారు చేస్తామని అని చెప్పుకున్నారని అన్నారు. పలివెల ఘటనలో ముందుగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి చేశారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇక నైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చిల్లర మాటలు మాట్లడితే ఉరుకోమన్నారు. ప్రజలు ఈ చిల్లరడ్రామాలను పట్టించుకోరు అని అన్నారు.

ఇవి కూడా చదవండి..

మునుగోడు మొనగాడు కూసుకుంట్ల..

పత్తా లేని చెయ్యి…

నల్గొండ…గులాబీ కంచుకోట

- Advertisement -