ఇప్పుడంతా సోషల్ మీడియా మాయే. ఎంత పబ్లిసిటి తెచ్చిపెట్టుకోవాలన్నా..ఎంత కాంట్రవర్శీ క్రియేట్ చెయ్యాలన్నా..అంతా సోషల్ మీడియాలను వాడుకునేవారే. అయితే పబ్లిసిటి తెచ్చిపెట్టే ఈ సోషల్ మీడియా ఒక్కోసారి కఫ్యూజ్ కూడా చేస్తుంటుంది. అది కూడా మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. అయితే ఈ సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టేవారు ఎక్కువగానే ఉన్నా.. వారికంటే ఎక్కువగా వాడుకునేది సెలెబ్రిటీలే.
వీరు ఎప్పుడు ఏ ఆప్డేట్ ఇవ్వాలన్నా సోషల్ మీడియాలో జిగేల్‌మంటూ మెరుస్తారు. అయితే అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు పొరపాట్లు కూడా చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాను వాడుకునే సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. అందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు.
ఈయన ఒక్కసారి సోషల్ మీడియాకొస్తే షేక్ అవ్వాల్సిందే. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటూ…ఆయనని కదిలించే విషయాలకు రియాక్ట్ అవుతుంటారు బిగ్ బి. అలాగే ఓ విషయంలో కూడా రియాక్ట్ అయ్యారు. కానీ అదికాస్తా.. రివర్స్ అయిపోయి కొంపముంచినంత పనైపోయింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వినోద్ ఖన్నా, అమితాబ్ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు. అయితే వినోద్ ఖన్నాకి క్యాన్సర్ అని వార్తలు రాగానే అమితాబ్ బచ్చన్ ట్విటర్‌లో ఓ మెసేజ్ పెట్టారు. ‘మన కుటుంబీకులు, స్నేహితులుచనిపోయినప్పుడు మనమెంత కాలం బతుకుతామో అని ఆలోచిస్తుంటాం. చాలా విచిత్రంగా ఉంది కదా’ అని ట్వీట్ చేస్తూ తాను దిగాలుగా ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేశారు.
దీంతో అమితాబ్ పెట్టిన మెసేజ్ వైరల్‌గా మారింది. అది చూసి చాలా మంది వినోద్ ఖన్నా చనిపోయారనుకుని ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారట. దీంతో వినోద్ ఖన్నా కుమారుడు రాహుల్ ఖన్నా తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని భయపడాల్సిన పనిలేదని మీడియా ద్వారా వెల్లడించడంతో అంతా కుదుటపడ్డారు.
చూశారా..సోషల్ మీడియాలో అమితాబ్ కూడా పొరపాటు చేసేశారు. అయితే ఇలాంటి పొరపాట్లు చేసినవాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పటికైనా ట్విట్టర్లలో తిరిగేవాళ్ళు కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది.