- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,439 మంది దర్శించుకోగా 29,450 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం రూ.4.60 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. భువనేశ్వర్‌కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఇక సంస్థ తరఫున ఇప్పటివరకు రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు రాఘవేంద్ర తెలిపారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడకు చెందిన తులసమ్మ, ఈశ్వర్ రెడ్డి దంపతులు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.5.5 లక్షలు విరాళంగా అందించారు.
ఇవి కూడా చదవండి..
పీఎస్-1 నవంబర్ 4న ఓటీటీలోకి వస్తుంది
- Advertisement -