మళ్లీ కరోనా కలకలం..

172
- Advertisement -

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. సింగపూర్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ వేరియంట్ లక్షణాలు మనదేశంలోనూ పెరిగిపోయాయి. మహారాష్ట్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సబ్ వేరియంట్ కేసులు కనిపించాయి.

ఈ తరహా వేరియంట్ కేసులు 70కి పైగా నమోదయ్యాయి. ఈ కేసులకు తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరిక కలవర పెడుతోంది. కరోనా మహమ్మారి కాలం ముగిసిపోలేదని, ఇప్పటికీ ఇది అంతర్జాతీయంగా ప్రమాదకర వైరస్ లానే ఉందని ప్రకటించింది.

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా అంతరించిపోయినట్లుగా కనిపిస్తోందని, కానీ ఇప్పటికీ ప్రజల ఆరోగ్యంపై వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది ఆరోగ్య సంస్థ. వైరస్ ను తట్టుకునే రోగినిరోధక శక్తి పెరగడం, వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య భారీగానే ఉండటంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు.

- Advertisement -